నయా తెలంగాణ న్యూస్ / మెదక్ 12 August 2025: మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో పిల్లికోటాల్ కాలనీలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మంగళవారం ఉదయం పోలీస్ లు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పి శ్రీనివాస్ రావు ఆదేశాలు మేరకు డిఎస్పి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పట్టణ సిఐ మహేష్ రామకృష్ణ, 10 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.సరైన పత్రాలు లేని 13 ఆటోలు, 02 కార్లు, 1 ట్రాలీ, 134 బైక్ లు సీజ్ చేశారు.
