సహజ సంపద ను దోచుకుంటున్న పట్టించుకునే నాథుడే లేడు నయా తెలంగాణ న్యూస్ / మెదక్, సెప్టెంబర్ 07:మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలా గ్రామంలో ఇసుక అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్నారు. సెలవు రోజు వచ్చిందంటే చాలు అక్రమంగా ఇసుక రవాణా తరలిస్తున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహారిస్తున్నారని, ప్రజాప్రతినిధులు అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ధైర్యం తో అడ్డు అదుపు లేకుండా ఇసుక మాఫియా రెచ్చిపోతుంది పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
