నయా తెలంగాణ న్యూస్ / డెస్క్, సెప్టెంబర్ 09:గ్రూప్-1 పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది. పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని, దాని ఆధారంగానే ఫలితాలు వెలువరించాలని టీజీపీఎస్సీ ని ఆదేశించింది. అది సాధ్యం కాకపోతే పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలిపింది. కాగా మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ సందర్భంగా ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది.

