నయా తెలంగాణ న్యూస్ / మెదక్ /హవేలీ ఘన్ పూర్, అక్టోబర్ 03: తన ఇంటికి వెళ్లడానికి దారి ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ రైతు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలంలోని వాడి గ్రామంకు చెందిన గుడుపల్లి సుభాష్ రెడ్డి (45) గత ఐదు ఆరు సంవత్సరాల నుండి తన ఇంటికి దారి ఇవ్వాలని కోరుతూ పలుమార్లు గ్రామస్తులకు కోరారు. దారి ఇవ్వాలని ప్రజావాణిలో కలెక్టర్ కు, పంచాయతీ శాఖ అధికారికి, డిఎస్పి, రూరల్ సిఐ కి అనేక సార్లు విన్నవించుకున్న పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం జిల్లా పంచాయతీ శాఖ అధికారి సర్వే కోసం వెళ్లగా గ్రామస్తులు సమస్యలు పరిష్కరించుకుంటామని అధికారికి తెలిపారని, కానీ ఇంతవరకు దారి ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై సుభాష్ రెడ్డి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే చికిత్సనిమిత్తం సుభాష్ రెడ్డిని మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
