నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 14 :మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం యూసుఫ్పేట్ గ్రామ పరిధిలోని పౌల్ట్రీ ఫారమ్ సమీప ప్రాంతంలో బొమ్మా బోరుసు (జూదం) ఆడుతున్న వ్యక్తులపై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి మొత్తం 12 మంది జూదగాళ్లను అదుపులోకి తీసుకొని వారివద్ద నుండి రూ. 14,049/- నగదు, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన వస్తువులు, అరెస్టయిన 12 మంది జూదగాళ్లను పాపన్నపేట్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.
