పండుగ పూట విషాదం

నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 19:కార్పోరేట్ జ్యువెలరీ వ్యవస్థలు స్వర్ణ కారులను శాసించడంతో పనులు లేక పూటగడవని గడ్డు పరిస్థితులు ఎదురుకుంటున్నారు స్వర్ణకరులు. బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో పనులు దొరకక మెదక్ పట్టణంకు చెందిన స్వర్ణకారుడు లష్కరి నరేష్ చారి (40) ఆర్థిక ఇబ్బందులు తాళ్లలేక ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య బాలమణి, ఇద్దరు కుమార్తెలు బిందుశ్రీ 13, శీరిష 10 లు కలరు. జ్యువెలరీ దుకాణాల ఆధిపత్యంతో పనులు లేక అన్నమొ రామచంద్ర అంటు అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోతున్న స్వర్ణకారులు ఆడుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని స్వర్ణకారులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *