(మార్చి 11) నయా తెలంగాణ / మునుగోడు : సన్నబియ్యం ముసుగులో నూకలు పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేస్తుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. సాధారణంగా మిల్లర్లు బియ్యంలో 5 శాతం నూకలు కలుస్తాయని కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 25% నూకలు కలపడానికి అనుమతి ఇచ్చిందన్నారు. మిల్లర్లు దొరికినదే అదునుగా 35% నూకలు కలిపి మొత్తం మోసాలకు తెరలేపుతున్నారని, నూకల బియ్యం వండుకుంటే అన్నం మొత్తం బంక బంక అవుతుందని, ప్రజలు తినలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం నిల్వ లేదని ఆయన ఆరోపించారు.
