మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒకరు కృషి చేయాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ కోరారు. మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గాంధీ పార్క్ లో శుక్రవారం బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసిన వీరుడని, అణగారిన వర్గాల, మహిళల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన ధీరుడని కొనియాడారు. ఈ సందర్బంగా చౌటుప్పల్ లో పూలే విగ్రహ ఏర్పాటుకు చౌటుప్పల్ మాజీ వైస్ ఎంపీపీ బొంగు జంగయ్య, కుక్కల నరసింహ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి మునుకుంట్ల సత్యనారాయణ లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బొంగు జంగయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి మునుకుంట్ల సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు ఆదిమూల శంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సిలివేరు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ సూర్యతేజ, బీసీ యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు బండిగారి వెంకట్ , బీసీ యువజన సంఘం చౌటుప్పల్ మండల అధ్యక్షులు ముప్పిడి కృష్ణ చైతన్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల నరసింహ, తెలంగాణ ఉద్యమకారులు లింగస్వామి, విశ్వకర్మ స్వర్ణకార సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండోజు సంతోష్ కుమార్, పశువుల యాదయ్య, గంగాపురం శీను, శ్యామ్, బీసీ యువజన సంఘం నారాయణపూర్ మండలంఉపాధ్యక్షులు నవీన్, తోనేశ్వర్, శైలేందర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *