(ఏప్రిల్ 12) నయా తెలంగాణ / నల్గొండ : నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరం లోనే ఓ వ్యక్తిని దారుణంగా మర్డర్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… గీతాంజలి కాంప్లెక్స్ మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ ఓనర్ సురేష్(37) ను కొంతమంది గుర్తు తెలియని దుండగులు మాస్కులతో వచ్చి వేట కత్తులతో దాడి చేశారు. దుండగులు తమ వెంట తెచ్చుకున్న వేట కత్తులతో సురేష్ గుండెల్లో పొడిచి మెడ పైన దాడి చేయగా సురేష్ తప్పించుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న డిఎస్పి శివరాం రెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. సిసి ఫుటేజ్ ఆధారంగా హత్య జరిగిన విధానాన్ని పరిశీలించారు. సురేష్ హత్యకు కుటుంబ కలహాల, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీస్లు దర్యాప్తు చేస్తున్నారు, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
