(ఏప్రిల్ 12) నయా తెలంగాణ / వలిగొండ : అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమ ఫోరం (TUF) ఆధ్వర్యంలో చేపట్టిన చైతన్య యాత్రను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి కోరారు. శనివారం ఆయన నయా తెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ చేపట్టిన చైతన్య యాత్ర ఆదివారం చౌటుప్పల్ కు చేరుకుంటుందని అన్నారు. ఈ యాత్రలో ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
