(ఏప్రిల్ 14) నయా తెలంగాణ / స్టేట్ నెట్వర్క్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళఖాతం కలుపుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన పని చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి పేరుతో కొత్త ఆరోఆర్ చట్టం చేసి నేటి అమలులోకి తెస్తుంది. మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద సాగర్‌, తిరుమలగిరి, కీసర మండలాల్లో ప్రవేశ పెడుతున్నారు. కొత్త పోర్టల్ తో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను, ప్రజల ఫిర్యాదులను సేకరించి జూన్‌ 2 నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా భూభారతి అమలు చేయనున్నారు. కోటిమంది ఒకేసారి లాగిన్‌ సర్వర్ లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోర్టల్ డిజైన్ చేయడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూభారతి లోగోలో తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు కల్పించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు మధ్యాహ్నం 3:30గంటలకు జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రారంభించానున్నారు. భూభారతిపై గందరగోళం సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *