(ఏప్రిల్ 14) నయా తెలంగాణ / చౌటుప్పల్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమాని బోదుల యాదగిరి చౌటుప్పల్ నుంచి చెరువుగట్టు వరకు పాదయాత్ర ప్రారంభించారు. బోదుల యాదగిరి గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని చౌటుప్పల్ నుండి అన్నవరం వరకు సైకిల్ యాత్ర చేశారు.

