(ఏప్రిల్ 14) నయా తెలంగాణ / చౌటుప్పల్

అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒకరు కృషి చేయాలని చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్యం వెంకటాచలం కోరారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ కోర్ట్ ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. ఈ సందర్బంగా వెంకటాచలం మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత, భారతరత్నం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలు దేశంలోని అన్ని వర్గాలకు అందే విధంగా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదన్నారు. అంబేద్కర్ కలలు కన్న అసమానతలు లేని సమాజ స్థాపనకు ప్రతి ఒకరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భారసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎండి ఖయ్యూం పాషా, మాజీ అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు తడక మోహన్, తాడూరి పరమేష్, ఎనమల్లె నాగరాజు, కానుగు వెంకటయ్య, చామట్ల జంగయ్య, రాఘవేంద్ర, శంకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *