నయా తెలంగాణ న్యూస్ :మిర్యాలగూడ నుండి కాచిగూడ కు వెళుతున్న ప్యాసింజర్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ నుండి కాచిగూడ కు వెళ్తున్న పాసెంజర్ రైలు బ్రేక్ లైనర్ లు పట్టుకోవడంతో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. విషయం గమనించిన రైలు సిబ్బంది అప్రమత్తమై రైలును బీబీ నగర్ రైల్వే స్టేషన్ లో నిలిపారు. ఫైర్ సిబ్బంది మంటలు అర్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతులు పూర్తాయిన తర్వాత రైలు ను తిరిగి కాచిగూడకు పంపారు.
