నయా తెలంగాణ న్యూస్ :కేరళ రాష్ట్రం త్రిశూరుకు చెందిన అభిజిత్ జొయ్ బీబీనగర్ ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో నాలుగవ సంవత్సరం చదువుతున్నారు. కాగా అభిజిత్ జొయ్ గురువారం బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు మృతదేహాన్ని భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్లు తెలిపారు
