నయా తెలంగాణ న్యూస్ / చౌటుప్పల్ 4th June: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో డ్రైవర్ తో పాటు ఒక ప్రయాణికురాలు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ తొలగిస్తున్నారు. ప్రమాదానికి గల మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *