నయా తెలంగాణ న్యూస్ / చౌటుప్పల్, ఆగస్ట్ 1: పేద ప్రజల కోసం హెచ్ఆర్సీ ఆర్టీఐ ట్రస్ట్ అందిస్తున్న సేవలు మరువలేనివని జిట్టా మహేష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుడి మల్కాపురం గ్రామానికి చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు మన్నె భీమా రెడ్డి జ్ఞాపకార్థం అతని పెద్ద కుమార్తె జిట్టా విజయలక్ష్మి, అల్లుడు వీరారెడ్డి, మనువళ్లు జిట్ట మధుసూదన్ రెడ్డి, మహేష్ రెడ్డిల ఆధ్వర్యంలో హెచ్ఆర్సీ ఆర్టీఐ ట్రస్ట్ సౌజన్యంతో శుక్రవారం చౌటుప్పల్ ఆస్పత్రిలోని రోగులకు, అంగన్వాడి కేంద్రాల్లోని చిన్నారులకు అరటి పండ్లు, బ్రేడ్ ప్యాకెట్ లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ తాత మన్నె భీమా రెడ్డి జ్ఞాపకార్థం ఆసుపత్రి రోగులకు, చిన్నారులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. హెచ్ఆర్సీ ఆర్టీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించడం, విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ, అన్నదానం లాంటి అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో హెచ్ఆర్సీ ఆర్టీఐ ట్రస్ట్ సేవ కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఇమ్మడి ఈశ్వర్, కొల్లూరి విక్రమ్, రామలింగం తదితరులు పాల్గొన్నారు.
