నయ తెలంగాణ న్యూస్, కుత్బుల్లాపూర్, ఆగస్టు 01

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,దివంగత నేత కూన వెంకటేష్ గౌడ్ విగ్రహాన్ని అయన జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్, కూన అంత్తయ్య గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దివంగత నేత కూన వెంకటేష్ గౌడ్ సేవలు మరువ లేనివని అన్నారు. కూన వెంకటేష్ గౌడ్ జ్ఞాపకాలు చిరకాలం ప్రజల మదిలో మేదిలే విధంగా అయన కుమారులు కూన శ్రావణ్ గౌడ్, కూన గౌరిశంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు కుత్బుల్లాపూర్ గాజులరామారంలోని కెవిఎస్ కన్వెన్షన్ లో శుక్రవారం కూన వెంకటేష్ గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అయన జ్ఞాపకార్ధంగా వెంకటేశ్వరా స్వామి దేవాలయానికి బంగారు తోరణలు అందజేశారు..
ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, కూన కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రజలు, అభిమానులు పాల్గోన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *