నయా తెలంగాణ న్యూస్ / చౌటుప్పల్, ఆగష్టు 17: ప్రముఖ డాక్టర్ సికిలమెట్ల రాంప్రసాద్ ఆదివారం ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ప్రభుత్వ వైద్యునిగా సేవలు అందించిన డాక్టర్ రాంప్రసాద్ ఉద్యోగ విరమణ అనంతరం ప్రైవేట్ క్లినిక్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించారు. రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ ఓపికగా వైద్య సేవలు అందించేవారని, రాంప్రసాద్ మృతి తీరని లోటని అన్నారు. డాక్టర్ రాంప్రసాద్ మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
