నయా తెలంగాణ న్యూస్ / ఆగష్టు 19: తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరా రావు శుభవార్త తెలిపారు. గత కొన్ని రోజులుగా యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు సరిపడా యూరియా సరఫరా చేసేందుకు కేంద్రంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తక్షణమే 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపునకు కేంద్రం హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. గుజరాత్, కర్ణాటక నుంచి తక్షణమే తెలంగాణకు యూరియా తరలించాలని ఆదేశించారని, వారం రోజుల్లో తెలంగాణకు యూరియా వస్తుందన్న మంత్రి తుమ్మల తెలిపారు.
