నయా తెలంగాణ న్యూస్ / డెస్క్, సెప్టెంబర్ 11: గ్రూప్-1 వ్యవహారంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయనున్న ప్రభుత్వం. తీర్పుపై ప్రభుత్వానికి టిజిపిఎస్సి చైర్మన్ నివేదిక,ప్రభుత్వ అనుమతి రాగానే కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

