నయా తెలంగాణ న్యూస్ / డెస్క్, సెప్టెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా సన్న రకం వడ్లు పండించిన రైతులకు వెంటనే బోనస్ డబ్బులు రూ. 500/- చెల్లించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్టొళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో అనేక మంది సన్న రకం వడ్లు పడించారాని, యాసంగి పంట కాలం అయిపోయిన బోనస్ డబ్బులు జమ కాకపోవడంతో రైతులు అనేక ఇబ్బంది పడుతున్నారని, వెంటనే బోనస్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
