హైదరాబాద్, అక్టోబర్ 7 (నయా తెలంగాణ న్యూస్):
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పెరుగుదల భవిష్యత్తులో కొనుగోలు కష్టమవుతుందనే భయంతో ప్రజలు ముందుగానే బంగారం కొనుగోలు చేయడానికి దుకాణాల వద్ద క్యూలైన్లలో నిలుస్తున్నారు.

హైదరాబాద్‌లోని సిద్థంబర్ బజార్‌లో శ్రీ కృష్ణ జ్యువెలరీ ముందు తెల్లవారు జామున నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. బంగారం వ్యాపారులు మాత్రం ముంబై ఇంటర్నేషనల్ మార్కెట్‌లోని తాజా ధరలు తెలిసిన తర్వాతే విక్రయాలు ప్రారంభిస్తున్నారు. సాధారణంగా ఇది మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రమే జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *