మహారాష్ట్ర బాలాఘాట్ కొండల్లో పుట్టి కర్నాటక మీదుగా మెతుకు సీమలో జొచ్చే మంజీరమా.. వెనక్కి మళ్లువనమూలికలెన్నో మోసి వ్యాధులెన్నో దూరం చేసి కోట్లాది జనుల గొంతు తడుపుతూ హైదరాబాద్ కే విశ్వఖ్యాతినదిన మంజీరమా.. వెనక్కి మళ్లుతేనె పట్టు నుండి జాలువారిన చుక్కల ధారలా ఎంత మధురమీ మంజీరం గళ్లు గళ్లుమని తిరగాడే దేవ కన్యలా చూడ తరమా ప్రవాహాల సోయగం మంజీరమా.. వెనక్కి మళ్లుకలికాలం దాపురించే కదా చెరుకు తీపి లేదు అమృత భాండమూ లేదు నురగలు కక్కుతున్న రసాయనాలు విషం చిమ్ముతున్న కలుషితాలే నీలో నిండుచుండే మంజీరమా.. వెనక్కి మళ్లుజంతు అవశేషాలు కంపెనీల కంపు ఫార్మా కాలకూటం ఒక్కటేమిటి సర్వ దారిద్రాలు ఇమిడిపోయే మంజీరమా.. వెనక్కి మళ్లునారింజ కొంత గంగకత్వ కొంత నక్క వాగు భరించలేనంత వేడి వేడి గరళం నీలో చేర్చుతుండే మంజీరమా.. వెనక్కి మళ్లుజంతువులు సైతం తాగలేనీ, తాకలేనీ దౌర్భాగ్యం దరిదాపుల్లో నిలువలేని కష్టం మంజీరమా… వెనక్కి మళ్లుసలసలా మరిగే రసాయనాలు ఛిద్రం చేస్తుంటే అణువణువూ మండిపోతుంటే అమ్మా.. మంజీరా ఏలా భరిస్తున్నావు. ఏలా మోస్తున్నావు మంజీరమా.. వెనక్కి మళ్లునిన్నే నమ్మిన భూ పుత్రులకు నీవే దిక్కని తలిచే లోకానికి ఏలా తల్లి విషాన్ని పంచగలవు మంజీరమా.. వెనక్కి మళ్లుబోరంచ పోచమ్మ అపర కాళీ చాముండేశ్వరి మీ కంటికి కనబడడం లేదా మంజీరా తల్లి ఘోష మీ దరి చేరడం లేదా పరిశ్రమల కంపు మంజీరమా.. వెనక్కి మళ్లుఈ జగమున ఏకైక మాతవన దుర్గా భవానీ.. మంజీరం నీ పాదాలు తాకుతుంటే వర్ష ఋతువున అభిషేకిస్తుంటే కాసైనా ఆగ్రహం కలగడం లేదా అమృతం తాగిన నిన్ను గరళమేమి చేస్తుందిలే మాబోటి భక్తులకేగా ముప్పు మంజీరమా.. వెనక్కి మళ్లునీ నామ స్మరణ చేస్తూ గరుడ గంగలో మునిగితే పునీతమవడమేమో కానీ ప్రాణాలే పోవుచుండే అమృతం పంచిన మంజీరా హాలాహలమై హరిస్తున్నా.. చలించకపోతే ఏలా దుర్గమ్మా.!మంజీరమా..ఏ తల్లీ ఆదుకునేలా లేదు. ఏ దేవుడూ అభయమిచ్చేలా లేడు నీ గర్భమున కొలువైన దేవదేవతలూ బండరాళ్లుగా మారిపోయిరి ఇంకా ఎందుకు తల్లీ.. వెనక్కి మళ్లుకాలకూటం కనుమరుగయ్యాక కలుషితాలు పోయి సుగంధాలుగా చేరాక మళ్లీ వద్దువు కానీ ఇప్పుడైతే వెనక్కి మళ్లుఎం.విష్ణు ప్రసాద్ సీనియర్ జర్నలిస్టు 9490866866
