నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 17:తెలంగాణలో సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని అమ్మవారు దేవాలయం గత 60 రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు నుండి విడుదల చేసిన నీటీ ప్రవాహం తో మంజీరా ఉప్పోంగడంతో ఆలయ అధికారులు గర్భాలయం దర్శనం నిలిపి వేశారు. రెండు రోజుల క్రితం సింగూరు ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో వరద ప్రవాహం తగ్గడం తో 62 రోజుల తర్వాత నేటి నుండి భక్తులకు శ్రీ వన దుర్గా భవాని అమ్మవారి దర్శన భాగ్యం కలగనుంది. భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా, సకల విఘ్నాలను తొలగించే ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని అమ్మ వారిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు సిద్ధంగా ఉన్నారు.
