నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 21:మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై టాస్క్‌ఫోర్స్ పోలీస్ లు మెరుపు దాడి చేసి పేకాటరాయులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.58,060/- నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
