నయా తెలంగాణ న్యూస్ /మెదక్, జనవరి 10:బతికినంత కాలం పేదవాడికి అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతు రావు అన్నారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం మైనంపల్లి స్వగ్రామమైన కొర్విపల్లి గ్రామంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాను స్వయంగా నిర్మించిన దుర్గా భవాని దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం క్రిస్టియన్, ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బారీ సంఖ్యలో సుమారు 300 కార్లతో బయలు దేరి స్వగ్రామం చేరుకుని నాయకులు కార్యకర్తలు అభిమానులు జయ జయ ధ్వానాల నడుమ 60 కేజీల కేక్ కట్ చేశారు. అనంతరం మైనంపల్లి హనుమంతు రావు మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం పని చేస్తానని, తనకు అధికారం ముఖ్యం కాదని ప్రజాసేవ ముఖ్యమని అన్నారు. ఎవరైన ఏ సమస్య ఉన్న తనను సంప్రదించగలరని అన్నారు. జనం అధిక సంఖ్యలో రావడంతో జిల్లా పోలీసు అధికారులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్, అరునార్తి వెంకటరమణ, సర్పంచ్ ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గుండారం కిరణ్ గౌడ్, జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఆవుల గోపాల్ రెడ్డి, జిల్లా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు చిట్కాలు మహిపాల్ రెడ్డి, హవేలీ ఘనపూర్ మండల నాయకులు పరుశురాం, నల్గొండ గద్దర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
