(మార్చి 10) నయా తెలంగాణ / చౌటుప్పల్ : బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీలోని గాంధీ పార్క్ లో బీసీ సంక్షేమ, యువజన సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి బహుజన ప్రజా ప్రతినిధులు, నాయకులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *