(మార్చి 11) నయా తెలంగాణ / చౌటుప్పల్ : చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. కమిటీ నూతన చైర్మన్ గా ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ గా ఆకుల ఇంద్రసేన రెడ్డి లతో పాటు మరో 16 మంది డైరెక్టర్ లను నియమించారు. నూతనంగా ఎన్నికయినా ఉబ్బు వెంకటయ్య, ఆకుల ఇంద్రసేన రెడ్డి లు మాట్లాడుతూ రైతులు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. తమ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
