(ఏప్రిల్ 13), నయా తెలంగాణ / చౌటుప్పల్ : బీజేపీతోనే దేశం అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్ అన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఆదివారం చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం, కొయ్యలగూడెం, డి నాగారం, పీపుల్ పహాడ్, అల్లాపురం చిన్న కొండూరు, పంతంగి, తంగడపల్లి గ్రామాలలో గావ్ మే చలో- బస్తి మే చలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా దేవాలయాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలలోని కుంటలు, చెరువులను సందర్శించి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కైరంకొండ అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, రిక్కల సుధాకర్ రెడ్డి, కట్ట కృష్ణ, పులిగిల్ల శ్రీనివాస చారి, నూనె మాధవి, చింతల ఎల్లేశా, ఈడుదుల ఐలయ్య యాదవ్, సురేందర్, శివ తదితరులు పాల్గొనడం జరిగినది.

