(ఏప్రిల్ 13) నయా తెలంగాణ / చౌటుప్పల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చౌటుప్పల్ మండలం కుంట్ల గూడెం గ్రామానికి చెందిన వెలిగే నర్సిరెడ్డి (48) అరేగూడెం స్టేజి వద్ద తన బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా విజయవాడ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు ఢీ కొట్టగా నర్సిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ పరారిలో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
