(ఏప్రిల్ 13) నయా తెలంగాణ / చౌటుప్పల్ :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తు సామాన్య ప్రజలపై అధిక ధరల భారము అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, పట్టణ కార్యదర్శి గోశిక కరుణాకర్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ తమ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు అచ్చే దిన్ వస్తుందని చెప్పారని, కానీ ఇప్పుడు నిత్యవసర సరుకులపై ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాగిరి కిష్టయ్య, మండల కమిటీ సభ్యులు చీరిక సంజీవరెడ్డి, బోయ యాదయ్య, పొట్ట శీను, పల్లె మధు కృష్ణ, కొండే శ్రీశైలం, ఆదిమూలం నందీశ్వర్, రత్నం శ్రీకాంత్, నేరేడు మహేష్, బాలగోని బాలరాజు, ఇటే బోయిన శేఖర్, గండని మహేష్,మానే సాలయ్య తదితరులు పాల్గొన్నారు.
