(ఏప్రిల్ 14) నయా తెలంగాణ / చౌటుప్పల్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పై ఉన్న యావ ప్రజల సంక్షేమం పట్ల లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మునుగోడులో ఎక్కడ చూసిన తాను చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని, ఈ ప్రాంతానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి కి ఎంతసేపు మంత్రి పదవి మీద యావ తప్ప ఈ ప్రాంత ప్రజల సమస్యల పై పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని, రాజగోపాల్ రెడ్డి పెద్ద బ్లాక్మెయిలర్ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి రూ. 40 కోట్లకు కొన్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మంత్రి పదవి కోసం వారిని పొగుడుతున్నాడని అన్నారు. ఎంపీ ని గెలిపించిన అని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి కి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ సపోర్ట్ లేకుండా తన మీద పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు నమ్మకం పోయిందని, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమం అట్టర్ ప్లాప్ అవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పై ప్రజలు తిరగబడుతున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లె రవి కుమార్, ఆందోజు శంకర చారీ, చింతల దామోదర్ రెడ్డి, పెద్దిటి బుచ్చి రెడ్డి, ముటుకులోజు దయాకర్ చారీ, నర్రి నర్సింహా, గడ్డం మురళీధర్ రెడ్డి, జక్కిడి ధనవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.