(ఏప్రిల్ 14) నయా తెలంగాణ / చౌటుప్పల్
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ అన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోశిక కరుణాకర్ మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల వారికి ఆర్థిక, సామాజిక, న్యాయ, రాజకీయ రంగాల్లో సమన్యాయం ఉండాలని ఆకాంక్షించి భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి మనకు అందించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలను దేశంలోని అన్ని వర్గాలకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒకరి పైన ఉందన్నారు. అంబేద్కర్ కలలు గన్న అసమానతలు లేని సమ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎండి. పాషా, అవ్వారీ రామేశ్వరి, నాయకులు బండారు నరసింహ, దండ అరుణ్ కుమార్, ఎండి ఖయ్యూం, ఉష్కాగుల శ్రీనివాస్, బత్తుల దాసు, బోదాసు నరేష్, బాతరాజు దశరథ, కృష్ణ, బొడ్డు అంజిరెడ్డి, బండారు విక్రమ్, చికూరు దయ, దాసరి ప్రకాష్, బోయ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *