(ఏప్రిల్ 15) నయా తెలంగాణ / స్టేట్ నెట్వర్క్ :
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో కాంగ్రెస్ V/s కాంగ్రెస్ పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ఇక్కడ నాయకులు బహిరంగంగానే ఒకరి పై మరొకరు విమర్శలు చేస్తుంటారు. భిన్నభిప్రాయాలు, బేదాభిప్రాయాలను తెలియజేసే క్రమంలో ఒక్కోసారి శృతి మించి అధిష్టాననికే తల నొప్పి తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లో మంత్రి పదవి కోసం అంతర్గత కుమ్ములాటలు కాస్త బహిరంగ సభలకు చేరుకున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా మాజీ మంత్రి జానారెడ్డి అడ్డుకుంటున్నారని, జానారెడ్డిని ధృతరాష్ట్రునిగా పోల్చారు. వివేక్ విషయంలో ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు, మంత్రి పదవి రాకుంటే రాజీనామా చేస్తానన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిలు వ్యాఖ్యలు ఇప్పుడు టీపీసీసీ కి తలనొప్పిగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇంటి పోరు మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. వీటన్నిటికీ చెక్ పెట్టాలనే ఉదేశ్యంతో ఈ రోజు ఉదయం 11గంటలకు శంషాబాద్ హోటల్ నోవటేల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కానుంది. భూభారతి, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సి వర్గీకరణ తో పాటు పలు ప్రభుత్వ, పార్టీ అంశాలపై కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ బహిరంగ సభ సమావేశాలపై మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ భేటీకి విప్ లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *