నయా తెలంగాణ న్యూస్ :
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వికాస్ సింగ్ ఎన్నికయ్యారు. 2017-18, 2021-22, 2022-23 అధ్యక్షునిగా పనిచేసిన వికాస్ సింగ్ తమ సమీప అభ్యర్థులు ప్రదీప్ రాయ్ , అధిష్ అగర్వాలా పై పోటీలో గెలిచి మరోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా రాహుల్ కౌశిక్, గౌరవ కార్యదర్శిగా ప్రగ్య బాగాల్, కోశాధికారిగా విక్రాంత్ యాదవ్ లు ఎన్నికయ్యారు. కాగా కార్యదర్శి పోస్టు మహిళకు రిజర్వ్ చేయడం జరిగింది.
