నయా తెలంగాణ న్యూస్ :చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చేనేత కార్మికుడు గోశిక భాస్కర్ (40) సోమవారం ఉదయం నైట్రేట్ (రంగులకు వినియోగించే ద్రవం) తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిని భార్య నవ్య (32) ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఇటీవల సూసైడ్ చేసుకోగా భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త భాస్కర్ సైతం సూసైడ్ చేసుకున్నారు. వీరికి సుభాష్ (8), మహాలక్ష్మి (4) పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోవడంతో పిల్లలు ఇద్దరు ఆనాధలయ్యారు. 15 రోజులలోనే ఒకే ఇంట్లో ఇద్దరు చేనేత కార్మికులు బల్వాన్మరణం చెందడంతో కొయ్యలగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *