నయా తెలంగాణ న్యూస్:
తేదీ: 01/07/2025 ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ దారుణమైందని, అది అమల్లోకొస్తే ట్యాక్స్ పెయెర్స్ పై చాలా భారం పడుతుందన్నారు. ఒకవేళ బిల్లు సెనేట్లో పాసైతే తాను తర్వాతి రోజే కొత్త ‘అమెరికా పార్టీ’ పెడతానని వార్నింగ్ ఇచ్చారు. డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు మేలు చేసే కొత్త పార్టీ అవసరమని ట్వీట్ (X) వేదిక గా తన అభిప్రాయాన్ని ఎలాన్ మస్క్ పోస్ట్ చేశారు.
