సంగారెడ్డి జిల్లా నయా తెలంగాణ. జూలై 30సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో మరో పేలుడు సంభవించింది. కెమికల్స్ డ్రమ్ములు తగులబెడుతుండగా పెద్దశబ్దం వచ్చి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో భయంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పారిశ్రామికవాడలో తరచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
