నయా తెలంగాణ/ సంగారెడ్డి జిల్లా/ ఆగస్టు1

ఒకప్పటిలాగా ఇప్పుడు ఆటోలకు అంత గిరాకీ లేదని కంగి మండలం నాగుర్ (బి)కి చెందిన ఆటో డ్రైవర్ బస్వరాజ్ శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కిరాయి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలకు ఫైనాన్స్లకు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకుని చేయూత ఇవ్వాలని కోరారు. నేడు ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్బంగా ఆటో డ్రైవర్ ల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకం ప్రవేశ పెట్టాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *