నయా తెలంగాణ న్యూస్/ సంగారెడ్డి / ఆగస్టు 1: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్సనల్ పిఏ. సాగర్ జన్మదిన వేడుకలను శుక్రవారం మంత్రి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేపించి తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సాగర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి దామోదర రాజనర్సింహ మార్గంలో నడుస్తున్న సాగర్ కు అష్ట ఐశ్వర్యాలతో, ఆయురరోగ్యాలతో నిండు నూరేండ్లు జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
