నయా తెలంగాణ న్యూస్/ యాదాద్రి భువనగిరి/ ఆగస్టు 1:
సంస్థాన్ నారాయణపురం: కుమ్మర్లు ఆర్థికంగా, విద్య, వైద్య, రాజకీయ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కుమ్మర సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ అన్నారు. వీరితోపాటు కో కన్వీనర్ గోపాల్ ఇతర సభ్యులతో కలిసి సంస్థాన్ నారాయణపురం మండలం నూతన కమిటీ అన్ని గ్రామాల ప్రజల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంస్థాన్ నారాయణపురం కన్వీనర్ గా చిలువేరు శంకర్, కో కన్వీనర్లుగా చిలివేరు సైదులు ఖమ్మంపాటి లక్ష్మణ్, సభ్యులుగా మురుగంటి శ్రీనివాసులు, చిలివేరు యాదయ్య, గుడ్డుపల్లి సత్యనారాయణ, చిలువేరు చిన్నస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. అమ్మవారి దేవాలయాల్లో కుమ్మర్లను పూజారిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కుమ్మర్లను కులం బీసీ-బి నుండి బీసీ-ఏ లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుమ్మర్లకు పింఛన్లు అందించాలని కోరారు. కుండలు తయారు చేసే మట్టిని ఉచితంగా వారికి అందించాలని కోరారు. తదనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ తోపాటు మండల కమిటీ మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నూతన కమిటి సమావేశంలో సంస్థాన్ నారాయణపురం మండలంలోని వివిధ గ్రామాల కుల పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దరిపల్లి ప్రవీణ్ కుమార్, ఓరుగంటి గోపాల్ తోపాటు తాడూరి డిసిఎం ఆంజనేయులు, తాడూరి సత్యం నమస్తే నారాయణపురం టౌన్ కుమ్మరి సంఘం ప్రెసిడెంట్ సిలివేరు నరసింహ, మరియు సభ్యులు తెలంగాణ బిక్షం చిలువేరు నారాయణ చిలువేరు వెంకటేశం చిలివేరు నరసింహ చిలివేరు అంజయ్య చిలువేరు సోమయ్య మురిదొడ్డి శ్రీను కొట్లూరి నవీన్ చిలువేరు శంకర్ చిలువేరు జంగయ్య రమేష్ చిలివేరు బిక్షమయ్య చిలువేరు రమేష్, మంచాల యాదయ్య చిలువేరు జంగయ్య చిలివేరు శ్రీశైలం చిలివేరు కృష్ణయ్య చిలువేరు అంజయ్య చిలివేరి వెంకటేష్ చిలివేరు అంజయ్య చిలువేరు పెద్దయ్య బొడ్డుపల్లి లక్ష్మయ్య చిలివేరి కృష్ణయ్య చిలువేరు పెంటయ్య గుడిపల్లి సత్యనారాయణ చిలివేరు గాలయ్య కొట్లూరి లక్ష్మయ్య చిదివేరు లింగయ్య తోపాటు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
