నయా తెలంగాణ న్యూస్ / నారాయణపురం, ఆగస్ట్ 1: నారాయణపురం మండలం గుడి మల్కాపురం గ్రామానికి చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు మన్నె భీమా రెడ్డి జ్ఞాపకార్థం ఆయన పెద్ద కుమార్తె జిట్టా విజయలక్ష్మి, అల్లుడు వీర రెడ్డి, మనవళ్ళు జిట్టా మధుసూదన్ రెడ్డి, మహేష్ రెడ్డి లు 8వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం గుడిమల్కాపురం గ్రామ పంచాయతకి బీరువాను బహుకరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంతగానో కృషి చేసారని కొనియాడారు. మన్నె భీమా రెడ్డి జ్ఞాపకార్థం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *