నయా తెలంగాణ న్యూస్,
తుర్కపల్లి,ఆగస్టు 01

తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి, కోనాపురం, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఎంపీడీవో లెంకల గీతారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అన్నారు. అనంతరం దత్తాయిపల్లి గ్రామంలో వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. వృద్ధులకు పెన్షన్ సరిగా అందుతుందా లేదా అని వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు నరసింహ, సందీప్ రెడ్డి, అల్తాఫ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *