నయా తెలంగాణ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆగస్ట్ తేదీ 06
మండల పరిధిలోని మహ్మదాబాద్ గ్రామంలో గల ఎస్టీ హాస్టల్లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ టీం ఆధ్వర్యంలో లీగల్ మెట్రాలజీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో కలిసి సోదాలు సాగుతున్నాయి. గదిలో ఉన్న రికార్డులతో పాటు విద్యార్థులకు రోజువారీ అందించే మెను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

